దివ్యాంగుల వాహనాలకు భారీ ఊరట: ఫాస్టాగ్ గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
దివ్యాంగులకు చెందిన వాహనాల టోల్ ట్యాక్స్ మినహాయింపు ఫాస్టాగ్ గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నూతన సవరణలు తోడ్పడనున్నాయి. వైకల్య శాతం ఆధారంగా గడువును వేర్వేరుగా నిర్ణయించామని, దీనివల్ల దివ్యాంగులు పడుతున్న అసౌకర్యం పూర్తిగా తొలగిపోతుందని కేంద్రం వెల్లడించింది.