అర్చకుల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరుతూ వినతి

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు రూరల్

నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ అర్చకులు మరియు శ్రీ పరమేశ్వరి ఆలయ అర్చకులు తమ నివాసంలో కలిసి సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం నెల్లూరులోని దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి దళిత, గిరిజన కాలనీల్లోని హిందూ దేవాలయాల అర్చకులకు ఇస్తున్న వేతనాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని పది వేల రూపాయలను పదిహేను వేలకు పెంచి మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.