హామీల అమలులో విఫలం.. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ వంట వార్పు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు వంటా వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీని విస్మరించి ప్రజలను మోసం చేశారని ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి పథకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపైనే వంట చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.