మూడు దశాబ్దాలుగా పసికవ్వులకు ఉచితంగా పాలు అందిస్తున్న టీ దుకాణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: బీహార్

బీహార్‌లోని నలంద జిల్లా రాజ్‌గిర్ బస్ స్టాండ్ వద్ద ఓ టీ దుకాణం యజమాని శ్రావణ్ కుమార్ 1990లో ప్రారంభించిన సత్సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి 18 నెలల వయసున్న పసికందుల ఆకలి తీర్చేందుకు ఆయన ఉచితంగా పాలు పంపిణీ చేయడం ప్రారంభించారు. శ్రావణ్ కుమార్ మరణం తర్వాత ఆయన తమ్ముడు రంజిత్ కుమార్ ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని ఎంతో నిబద్ధతతో ముందుకు నడిపిస్తున్నారు.