ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో తెలంగాణ రక్షణ సేన అంటూ కవిత సవాల్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో చేతలు శూన్యమని ఆమె విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫామ్హౌస్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.