రాజేంద్రనగర్లో కోటి రూపాయల భారీ ధర పలికిన లడ్డూ

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన వినాయక చవితి వేడుకలు ఉత్కంఠభరితంగా సాగాయి. మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలం పాటలో శక్తిమాన్ బృందం ఈ ప్రసాదాన్ని ఏకంగా రూ.1.01 కోట్లకు దక్కించుకుంది. గత ఏడాది ఇదే ప్రాంతంలో లడ్డూ రూ.2.31 కోట్లు పలకగా, ఈసారి కూడా కోటి రూపాయల మార్కును దాటడం విశేషం. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.