రైతులకు మేలు చేసేలా గోశాలలో వర్మి కంపోస్ట్ తయారీకి చర్యలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామ సమీపంలోని ధ్యాన్ ఫౌండేషన్ గోశాలను శనివారం ఆత్మ కమిటీ చైర్మన్ ఎనగండ్ల సుధాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు పూనం కపూర్ తో పాటు పశు వైద్యాధికారి డాక్టర్ కె. భాస్కర్, పశు వైద్య గణాంక అధికారి పెండెం శ్రీనివాస్ లతో ఆయన చర్చించారు. రైతులకు వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి కావలసిన గేదెల పేడను సేకరించి అందించాలని నిర్వాహకురాలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా సెక్రెటరీ ఇంజ నరేష్ తదితరులు పాల్గొన్నారు.