నెల్లూరు జిల్లాలో పోలీసుల ప్రత్యేక భద్రతా తనిఖీలు మరియు అవగాహన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజల రక్షణకు పోలీసులు చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలను SP Nellore వెల్లడించారు. జిల్లాలో రాత్రివేళ డ్రైవర్ల కోసం ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించడంతోపాటు, మహిళలు మరియు బాలికల భద్రత కోసం శక్తి యాప్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అలాగే కావలి రూరల్ పోలీసుల తనిఖీల్లో 92.79 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.