రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట: సూపర్‌ఫాస్ట్ హోదా తొలగింపుతో తగ్గనున్న ఛార్జీలు
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి ఉత్తర రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ ఛార్జీలు తగ్గనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్ణీత వేగాన్ని అందుకోలేకపోతున్నారనే కారణంతో పద్దెనిమిది రైళ్లకు ఉన్న సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగించి సాధారణ ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై పడుతున్న అదనపు సర్‌ఛార్జీ భారం పూర్తిగా తొలగిపోతుందని అధికారులు స్పష్టం చేశారు.