జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్ లో జనసేన సంచలన విజయం: వాసిరెడ్డి మేఘన గెలుపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Jaggayyapet
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్ లో జనసేన అభ్యర్థి వాసిరెడ్డి మేఘన విజయం సాధించారని అధికారులు వెల్లడించారు. తన సమీప ప్రత్యర్థిపై ఐదు వందల నలభై ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె కావడంతో ఈ ఎన్నికల ఫలితం స్థానికంగా తీవ్ర రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మేఘన గెలుపుతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.