పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్న జూకంటి ప్రవీణ్ కుమార్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో తహసిల్దార్ గోలి రవికిరణ్ కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ గురువారం పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు దరఖాస్తును అందజేశారు. అర్హత కలిగిన విద్యావంతులంతా నిర్ణీత గడువులోగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఫారం-18 సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మేధావులు భాగస్వామ్యం కావాలని కోరారు.