థియేటర్లలో తెలంగాణ సాంప్రదాయ వంటకం సర్వపిండి అందుబాటులోకి తెచ్చిన మైత్రీ థెయేటర్స్
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ థియేటర్స్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. మైత్రీ విమల్ మరియు మైత్రీ శివగంగ థియేటర్లలో త్వరలో విడుదల కానున్న ది ప్యారడైజ్ చిత్ర ప్రదర్శన సమయంలో ఇంటర్వెల్ బ్రేక్‌లో తెలంగాణ సాంప్రదాయ వంటకం సర్వపిండిని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఆదరణ పొందిన బామ్మాస్టోరీస్‌కు చెందిన 77 ఏళ్ల బామ్మ తయారు చేసే ఈ సర్వపిండి సినిమా చూస్తూ ఆస్వాదించేలా సరికొత్త అనుభూతిని ఇస్తోంది.