మెగా డీఎస్సీపై వైకాపా దుష్ప్రచారం: మంత్రి వాసంశెట్టి, ఎమ్మెల్యేల ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

మెగా డీఎస్సీపై వైకాపా కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. పారదర్శకంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను సాక్షి మీడియా, కిరాయి గూండాలతో భయభ్రాంతులకు గురిచేయడం హేయమన్నారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని జగన్‌కు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదని మండిపడ్డారు.