చైనాతో సంబంధాలు బాగున్నాయని ట్రంప్ వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చైనాతో సంబంధాలు చాలా బాగున్నాయని, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో వైట్ హౌస్ లో జరగనున్న సమావేశంలో పలు కీలక ఒప్పందాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. దశాబ్ద కాలం తర్వాత షీ జిన్ పింగ్ అమెరికా అధ్యక్ష భవనానికి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.