వినాయకుడు బిర్యానీ తింటున్నట్లు బ్యానర్ పెట్టిన యజమాని అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని తిరునెల్వేలిలో హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన బిర్యానీ దుకాణం యజమాని జయంత్ అరెస్ట్ అయ్యాడు. వినాయకుడు బిర్యానీ తింటున్నట్లు ముద్రించిన వివాదాస్పద బ్యానర్‌ను దుకాణం ముందు ఏర్పాటు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్వరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.