వీసా విధానంలో సమూల మార్పులు: దరఖాస్తు ఫారాలు కుదింపునకు కేంద్రం సన్నాహాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
వీసా విధానంలో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను పదమూడు నుంచి తొమ్మిదికి తగ్గించనున్నట్లు తెలిపారు. వీసా దరఖాస్తు ఫారాల్ లోని డెబ్బై శాతం కాలమ్స్‌ను తొలగించి, మరింత సరళీకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని వీసా కేటగిరీలు, సబ్ కేటగిరీల్ లో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.