టాటా గ్రూప్ కంపెనీల్లో భారీగా పెరిగిన ఎల్ఐసీ పెట్టుబడులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: భారతదేశం
దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌గా ఉన్న ఎల్ఐసీ టాటా గ్రూప్ షేర్లలో తన పెట్టుబడులను భారీగా పెంచింది. టాటా గ్రూప్‌లోని 14 లిస్టెడ్ కంపెనీల్లో ఎల్ఐసీకి వాటాలు ఉండగా, 2022 నుంచి వీటిలో 10 కంపెనీల్లో తన వాటాను పెంచుకోవడంతో పెట్టుబడుల మొత్తం విలువ రూ. లక్ష కోట్ల మార్కును దాటింది. అత్యధికంగా టీసీఎస్‌లో 5.52 శాతం వాటా విలువ రూ.41,960 కోట్లుగా ఉంది.