బెల్లంపల్లి కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుంభాల రాజేష్ నియామకం

రిపోర్టర్: NARESH స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుంభాల రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.