డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: సజ్జల
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీచర్ పోస్టులను అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.