శివసేన నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ నిలేష్ ఓఝా తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Thane

దిశ సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ తో పాటు తనకు, సాక్షి సమీర్ వాంఖడేకు శివసేన ఉద్ధవ్ వర్గ నేతల నుంచి ప్రాణహాని ఉందని న్యాయవాది నిలేష్ ఓఝా వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, సీబీఐకి, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రక్షణ కోరుతూ లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. నిందితుడికి వై ప్లస్ భద్రత కల్పించి, తమను మాత్రం రక్షించడంలో విఫలమయ్యారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.