నేతన్నల ఉపాధిని దెబ్బతీశారంటూ సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: రాజన్న సిరిసిల్ల

బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయడంతో పాటు పది శాతం యార్న్ సబ్సిడీని ఎత్తేసి సిరిసిల్ల నేతన్నల బతుకులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పెండింగ్లో ఉన్న అరవై కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్న రేవంత్రెడ్డి రాజకీయ విమర్శలు మానుకుని, నేతన్నల సమస్యలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని ఆయన ఒక లేఖలో పేర్కొన్నారు.