వినాయక చవితి వేళ భక్తులకు పూలు, పండ్ల ధరల షాక్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

వినాయక చవితి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో కిలో బంతిపూలు రూ. 150కి చేరగా, వెలగపండు రూ. 50, టెంకాయ రూ. 50, అరటిపండ్లు డజను రూ. 80కి విక్రయిస్తున్నారు. అకస్మాత్తుగా పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి భక్తుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది.