విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న స్వచ్ఛరథాల పరుగు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

గ్రామాలు మరియు పట్టణాలను చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛరథాల కార్యక్రమం విజయనగరం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. చీపురుపల్లి మండలం గరివిడిలో డీడీవో హేమసుందరరావు వస్తువుల సేకరణ ప్రక్రియను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మండలానికి ఒక రథాన్ని ఏర్పాటు చేసి, ఇళ్లలోని పనికిరాని వస్తువులను సేకరించి వాటికి తూకం వేసి నిత్యావసరాలు అందజేస్తున్నారు.