పాడి రైతుల కోసం సబ్సిడీపై గేదెల పంపిణీ: మంత్రి వాకిటి శ్రీహరి
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో సబ్సిడీపై పాడి గేదెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు 100 వెటర్నరీ డాక్టర్లు, 304 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.