మహారాష్ట్రలో లా ప్రవేశాల మూడో విడత జాబితా విడుదల
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశాల కోసం కేంద్రృత ప్రవేశ ప్రక్రియ మూడో విడత జాబితాను సెట్ సెల్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 223 లా కాలేజీల్లోని 12,767 సీట్లకు గాను 29,577 మంది విద్యార్థులు ప్రాధాన్యతలు సమర్పించగా, ఈ విడతలో 11,756 మందికి ప్రవేశం కల్పించారు. ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ 24వ తేదీలోగా ఆయా కళాశాలల్లో ధ్రువపత్రాలు సమర్పించి ప్రవేశాలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.