అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలు అందేలా అధికారులు పని చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.