ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులోకి వచ్చిన కరోనా కేసులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి యాక్టివ్ కేసులు లేవని అధికారులు అధికారికంగా వెల్లడించారు. జూన్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు వెయ్యి ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించగా ది ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, నలుగురు మృతి చెందారని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.