నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ బిగ్ అప్డేట్, త్వరలో పదివేల ఉద్యోగాల భర్తీ
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 పోస్టుల సంఖ్యను 167కు పెంచడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద దాదాపు 10,000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 15న ప్రాథమిక నోటిఫికేషన్, అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు ఓటీఆర్ ద్వారా వివరాలు అప్డేట్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.