రాజాపేట యునాని ఆసుపత్రిలో ఘనంగా యోగా అవగాహన సదస్సు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ యునాని దావఖానాలో బుధవారం యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ చందన, మెడికల్ ఆఫీసర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.