9.09 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 9.09 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో 1.36 లక్షల ఎకరాల గ్రామ సేవా ఇనాం భూములు కూడా ఉన్నాయి. అయితే నిబంధనలు ఉల్లంఘించి మార్చిన 3.63 లక్షల ఎకరాలపై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.