గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: ఢిల్లీ

గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో 2026-27 వింటర్ సెషన్ పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని వర్సిటీ అధికారులు తెలిపారు. నవంబర్ రెండు నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లా, సైన్సెస్ సహా పలు విభాగాలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్ఫై నిమిషాలలోపు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.