విధి నిర్వహణలో విషాదం: కరెంట్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జహీరాబాద్
విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్ తగిలి హరీష్ అనే అసిస్టెంట్ లైన్మెన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జహీరాబాద్ మండల పరిధిలోని ఒంటేల్ గడ్డ తండాకు చెందిన హరీష్ విద్యుత్ తీగలకు మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న వయసులోనే ఉద్యోగి అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని స్థానికులు వెల్లడించారు.