టాలీవుడ్ లో ఘనంగా పూజా కార్యక్రమాలు: ప్రారంభమైన సకల సమృద్ధి ఆర్ట్స్ తొలి చిత్రం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. రాజీవ్ వర్మ హీరోగా, మలైకా టి. వాసుపాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని, కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించేలా ఫ్యామిలీ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.