గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
రిపోర్టర్: నరేష్
స్థలం: India
గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు కుదించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సురేశ్ గోపీ అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీరి, సకాలంలో సరఫరా జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.