సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరులో తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల సంఘం ప్రతినిధులు సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పేస్కేల్ అమలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. గౌరవ వేతనం చాలక కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు.