కోరుట్లలో సంచలనం సృష్టించిన పరువు హత్య ఉదంతం
రిపోర్టర్: కిరణ్
స్థలం: కోరుట్ల
కోరుట్లలో ఆరు నెలల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ హత్యకు గురైన ఉదంతం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పనిచేసే చోట పరిచయమై ప్రేమ వివాహం చేసుకున్న హరిబాబు, వైష్ణవి దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో మార్చి 16న వైష్ణవిని భర్త హరిబాబు హత్య చేశాడు. ఈ కేసులో జైలుపాలై బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు నిజామాబాద్‌లో హత్యకు గురయ్యాడు. తన చెల్లెలిని చంపిన హరిబాబును తానే హత్య చేశానని వైష్ణవి అన్న సంతోష్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.