భారత్‌లో త్వరలో విడుదల కానున్న మివి వన్ ఫైవ్ జీ స్మార్ట్‌ఫోన్
రిపోర్టర్: రాము
స్థలం: India
భారతీయ మార్కెట్లోకి ప్రముఖ ఆడియో బ్రాండ్ మివి నుంచి తొలిసారిగా మివి వన్ ఫైవ్ జీ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించనున్న ఈ ఫోన్ యాండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా వ్యవస్థను ఇందులో పొందుపరిచారు.