గన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రాకా సినిమా

రిపోర్టర్: సునీల్ స్థలం: భారతదేశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రాకా షూటింగ్ పూర్తికాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఏకకాలంలో రియల్ టైమ్ లో ముప్పై ఏడు మంది నటులపై మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అరుదైన ఘనత సాధించగా, దర్శకుడు అట్లీతో పాటు హీరో అల్లు అర్జున్ ఈ రికార్డు సర్టిఫికెట్ అందుకున్నారు.