రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం

రిపోర్టర్: గోపి స్థలం: ఢిల్లీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశ ప్రధానమంత్రి కాలేరని, కావాలనుకుంటే జీవితాంతం మాక్ పార్లమెంట్లోనే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1984 నాటి సిక్కుల ఊచకోత జరిగిన రోజే ఈ కార్యక్రమం నిర్వహించడం బాధితుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.