'ఇది విలీనం కాదు తెలంగాణ విమోచనం': బండి సంజయ్ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ విమోచన దినాన్ని విలీనం లేదా సమైక్యత అంటున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఇది తెలంగాణ గడ్డ సాధించుకున్న అసలుసలైన విమోచన అని ఆయన స్పష్టం చేశారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని చాటిచెప్పాల్సిన రోసమిదన్నారు. నిజాం మెడలు వంచి, రజాకార్ల అరాచకాలను అంతం చేసిన ఘనత సర్దార్ పటేల్ దేనని బండి సంజయ్ కుమార్ తేల్చిచెప్పారు.