ఓటర్లకు ఈసీ భారీ ఊరట: నవంబర్ 30న తుది జాబితా ప్రచురణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ను మరోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు చేసిన విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు స్పష్టం చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితాను నవంబర్ ముప్పైవ తేదీన ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.