రాష్ట్రంలో భారీ షాక్: పంతొమ్మిది మున్సిపాలిటీల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్రంలోని పంతొమ్మిది మున్సిపాలిటీలలో జరగాల్సిన ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువుతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటనను కూడా హోల్డ్లో పెట్టారు. పూర్తి స్థాయి తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై ఎన్నికల సంఘం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.