ఐఐటీ తిరుపతితో కెనడా సంస్థ కీలక ఒప్పందం: జియో ఏఐ పరిశోధనలకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తిరుపతి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఐఐటీ తిరుపతి కీలక అడుగు వేసింది. కెనడాకు చెందిన డీప్ స్పేషియల్ సంస్థతో ఐఐటీ తిరుపతి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. జియో స్పేషియల్ టెక్నాలజీస్, స్పేషియల్ ఏఐ రంగాల్లో సంయుక్తంగా పరిశోధనలు చేపట్టేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు. పరిశోధనలతో పాటు విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు వివరించారు.