న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ రాగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: వెంకటగిరి

న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కొన్ని కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోయిన తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపి ఎన్నికల షెడ్యూల్ వెలువడేలా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.