సోదరి అంబికపై పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ నటి రాధ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చెన్నై
ప్రముఖ కథానాయిక రాధ తన సోదరి అంబిక, సోదరుడు అర్జున్లపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. తన సంతకం ఉన్న ఖాళీ చెక్కులను దొంగిలించి దాదాపు రూ. 50 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనల కేసులో ఆర్థిక భారాన్ని తీర్చుకోవడానికే తన సోదరితో కలిసి ఈ మోసానికి తెరలేపారని, నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాధ కోరారు.