ప్రకాశం జిల్లా ప్రత్యేకత: ఒంగోలు ఉత్సవంలో జాతి గిత్తల ప్రదర్శన

రిపోర్టర్: శివ స్థలం: ప్రకాశం

ఒంగోలు ఉత్సవంలో భాగంగా నిర్వహించిన ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రాజసం మరియు పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్తలు మన ప్రకాశం జిల్లా ప్రత్యేకతకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.