కడపలో కూటమి ప్రభంజనం: ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఎన్డీయే

రిపోర్టర్: సునీల్ స్థలం: కడప

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీయే కూటమి అపూర్వ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. బద్వేలు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు స్థానాల్ లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించగా, ఎర్రగుంట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.