నాగర్కర్నూల్ జిల్లాలో అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
రిపోర్టర్: మహేష్
స్థలం: నాగర్కర్నూల్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం వేంకల్, మల్లేశ్వరం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, వీవో భవన నిర్మాణాలతో పాటు కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.