రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా పాలమాకుల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని శంషాబాద్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కేతావత్ లింబ్యా నాయక్, ఆయన భార్య జమున, మాన్ సింగ్, వసురాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు అశోక్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.