తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుమల

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని పూజించి, ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమలకు విచ్చేసిన డిప్యూటీ సీఎంకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.